: సీమాంధ్ర టీడీపీ ఎంపీలకు సంఘీభావం తెలిపిన ఎపీఎన్జీవో అధ్యక్షుడు
పార్లమెంటు ఆవరణలో నిరాహార దీక్ష చేస్తున్న సీమాంధ్ర టీడీపీ ఎంపీలకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణలను పరామర్శించిన సందర్భంగా ఆయన తన మద్దతు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేయాలని ఆయన వారికి సూచించారు. లోక్ సభ నుంచి సస్పెండైన అనంతరం పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించాలంటూ వారు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.