: చెన్నయ్ టెస్టులో పట్టుబిగిస్తోన్న భారత్.. ఆసీస్ 123/5
చెన్నయ్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అశ్విన్, హర్భజన్ చెరో 2 వికెట్లు తీయగా, జడేజా ఓ వికెట్ సాధించాడు. మరోసారి ఆసీస్ టాపార్డర్ విఫలం కావడంతో కెప్టెన్ క్లార్క్ (30 బ్యాటింగ్) జట్టును గట్టెక్కించే బాధ్యత భుజాలపై వేసుకున్నాడు.
కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 70 పరుగులు వెనకబడే ఉన్నకంగారూలు ఈ మ్యాచ్ కనీసం డ్రా చేసుకోవాలకున్నా.. రెండ్రోజుల పాటు పోరాడాల్సి ఉంటుంది. మ్యాచ్ కు నాలుగో రోజు పిచ్ స్పిన్ కు విపరీతంగా సహకరిస్తుండడం ఆసీస్ కు ప్రతికూలంగా మారనుంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 572 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 380 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.