: ఆహార భద్రత బిల్లు వల్ల దళారులకే లబ్ధి: శరద్ యాదవ్


పేదల కోసం ప్రారంభించిన పథకాలు వారికి చేరడం లేదని జేడీయూ నేత శరద్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రత బిల్లుపై లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లు ద్వారా పేదల కన్నా దళారులకే ఎక్కువ లబ్ధి కలుగుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయనంత కాలం ఎన్ని పథకాలు తెచ్చినా ప్రయోజనం లేదని శరద్ యాదవ్ పేర్కొన్నారు. ఆహార భద్రత బిల్లు వల్ల ఒరిగేది ఏమీ లేదని, కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఆగమేఘాల మీద ఆహార భద్రత బిల్లు అమలుకు అత్యుత్సాహం చూపిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News