: జైల్లో జగన్ తో ఎమ్మెల్యే గొట్టిపాటి భేటీ
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఈ రోజు చంచల్ గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి పథకాలు అమలు కావాలంటే జగన్ సీఎం అవ్వాలని ఆకాంక్షించారు. త్వరలోనే వైఎస్సార్సీపీ తీర్దం పుచ్చుకుంటానని చెప్పిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. జగన్ ను జైల్లో పెట్టడం అన్యాయమన్నారు.