: ఆహార భద్రత బిల్లులో రైతులకు హామీ ఏదీ లేదు: ములాయం
ఆహార భద్రత బిల్లుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకోవాల్సి ఉందని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుతో రాష్ట్రాలపై భారం పడుతుందని, రైతులకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదల సంఖ్యపై సరైన గణాంకాలే లేవని, అలాంటప్పుడు ఆహారభద్రత బిల్లు ఎంతమందికి అందుతుందని ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆహార భద్రత బిల్లు కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని ములాయం విమర్శించారు.