: కావూరి కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల భేటీ
పార్లమెంటులోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీలు ఉభయసభల నుంచి బహిష్కరణకు గురైన నేపథ్యంలో.. ఇకపై పార్లమెంటులో సీమాంధ్ర ప్రజల మనోభావాలు వ్యక్తమయ్యేలా ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలి? అన్న అంశంపై చర్చిస్తున్నారు. సస్పెండైన టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలనే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తుండడంతో, వారి ఆరోపణలను తాము ఎలా ఎదుర్కోవాలి? అన్న దానిపై కూడా చర్చిస్తున్నారు.