: రాజ్యసభ నుంచి సుజనా, సీఎం రమేశ్ సస్పెన్షన్
సభా సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ రాజ్యసభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఆర్టికల్ 255 ప్రకారం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ వారిని సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసేంతవరకు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే సభ అరగంట పాటు వాయిదాపడింది. సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటూ టీడీపీ నేతలు సభలోనే ఉండి నినాదాలు చేశారు.