: శ్రీహరి కోటకు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా రాష్ట్రపతి వెంట ఉన్నారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ వీరికి సాదర స్వాగతం పలికారు. సాయంత్రం జరగనున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని వీరు వీక్షిస్తారు.