: 'ఆహార భద్రత బిల్లు'తో 67శాతం ప్రజలకు లబ్ది: కేవీ థామస్
ప్రతిష్ఠాత్మక 'ఆహార భద్రత బిల్లు'పై లోక్ సభలో చర్చ మొదలైంది. చర్చను మంత్రి కె.వి.థామస్ ప్రారంభించారు. ఈ బిల్లుతో దేశంలో 67 శాతం ప్రజలకు లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రతి వ్యక్తికి ఏడు కిలోల చొప్పున ఐదుగురున్న కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న కేటాయింపులు కొనసాగిస్తామన్న మంత్రి, లబ్దిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. ఆహార భద్రత బిల్లుతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత జవాబుదారీగా పని చేస్తుందన్నారు. దీని ద్వారా రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర లభిస్తుందన్నారు.