: సచివాలయంలో నిరసనలపై ఆంక్షలు


సచివాలయం నిరసనలతో హోరెత్తిపోతోంది. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ నినాదాలతో నిత్యం మార్మోగిపోతున్న సచివాలయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శాంతియుతంగా నిరసన చేపట్టాలి కానీ, మైకులు ఉపయోగించరాదని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు తప్ప బయటి వ్యక్తులను ఆహ్వానించరాదని అందులో పేర్కొన్నారు. కాగా 27వ రోజు కూడా సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు కొనసాగాయి. సీ బ్లాక్ ముందు సోనియా వ్యతిరేక నినాదాలతో సచివాలయాన్ని సీమాంధ్ర ఉద్యోగులు హోరెత్తించారు.

  • Loading...

More Telugu News