: లొంగిపోయిన ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
జడ్చర్ల టీడీపీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (ఎర్ర చంద్రశేఖర్) మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. సోదరుడు జగన్మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శేఖర్ కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. జులై 17న ఈ హత్య జరగ్గా, పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి శేఖర్ ను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం శేఖర్ పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.