: బీజేపీ అబద్దాలాడుతోంది: ములాయం
బీజేపీ 'కోసీ' యాత్రపై అన్నీ అబద్దాలే చెబుతోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మండిపడ్డారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ యూపీలో 'కోసీ' యాత్ర తలపెట్టిన వీహెచ్ పీ నేతల అరెస్టు సందర్భంగా ఎటువంటి దాడులు జరగలేదని తెలిపారు. మత విద్వేషాలు రేగే అవకాశముండడంతో ప్రభుత్వం అరెస్టులు చేసిందని స్పష్టం చేశారు. వీహెచ్ పీ నేతలు అవగాహనా రాహిత్యంతో యాత్రను చేపట్టారని మండిపడ్డారు. అయోధ్యలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నాయని ములాయం సభ దృష్టికి తెచ్చారు. చట్టాలను గౌరవించి, శాంతి భద్రతల ఉల్లంఘనలు జరగకూడదన్న సదుద్దేశంతోనే సాధువులను అరెస్టు చేశామని, ఈ సందర్భంగా హింసకు తావు లేని విధంగా పోలీసులు వ్యవహరించారని ములాయం తెలిపారు.