: అత్యాచారాలు దేశాన్ని అపఖ్యాతి పాల్జేస్తున్నాయి: ఎంపీలు


ముంబైలో జరిగిన ఫొటో జర్నలిస్టు అత్యాచార ఘటనపై లోక్ సభలో కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటన చేశారు. షిండే ప్రకటన సందర్భంగా ప్రతిపక్ష నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు ఒకవైపు అందలాలు అందుకుంటుండగా, మరోవైపు అత్యాచార ఘటనలు దేశాన్ని అపఖ్యాతి పాల్జేస్తున్నాయని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆడవారిపై జరుగుతున్న లైంగిక దాడులు చూస్తుంటే ఈ దేశంలో చట్టాలు పనిచేస్తున్నాయా? అనే అనుమానం కలుగుతోందని తృణముల్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దానికి షిండే సమాధానమిస్తూ.. వారినందరినీ పోలీసులు పట్టుకున్నారని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు తప్పు ఒప్పుకున్నారని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News