: చెన్నై చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన ముఖ్యమంత్రి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కిరణ్ తో కలిసి రాష్ట్రపతి శ్రీహరి కోటకు వెళ్లనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఈ సాయంత్రం 5 గంటల తర్వాత జరిగే పీఎస్ఎల్వీ-సీ20 ప్రయోగాన్ని ఆయన వీక్షిస్తారు.