: టీఆర్ఎస్ శాంతిర్యాలీ... అడ్డుకున్న పోలీసులు
హైదరాబాదులోని నిజాం కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తలపెట్టిన శాంతిర్యాలీకి పోలీసులు అడ్డుతగిలారు. ర్యాలీకి ముందస్తు అనుమతి లేకపోవడంతో ర్యాలీకి అభ్యంతరం చెప్పారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్ధి నాయకులతో సహా, టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.