: పార్లమెంటు ఆవరణలో సీమాంధ్ర టీడీపీ నేతల దీక్ష


పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర టీడీపీ నేతలు నిరాహార దీక్షకు దిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్పలు దీక్షలో పాల్గొన్నారు. తమను సస్పెండ్ చేయటాన్ని ఖండించాలని, న్యాయం కావాలని ప్లకార్డులు పట్టుకుని దీక్ష చేస్తున్నారు. లోక్ సభ మొదలైనప్పటి నుంచి వీరు ఆందోళనలు, నినాదాలు చేస్తూ సమావేశాలకు అడ్డుతగులుతుండడంతో స్పీకర్ నలుగురు టీడీపీ సభ్యులను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో, వీరు తమ నిరసన కార్యక్రమాలను పార్లమెంటు వెలుపల చేపడుతున్నారు.

  • Loading...

More Telugu News