: వీహెచ్ పీ యాత్రపై రగడ.. లోక్ సభ వాయిదా
ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంటు ఉభయసభలు వాయిదాపడ్డాయి. వీహెచ్ పీ (విశ్వ హిందూ పరిషత్) ఉత్తరప్రదేశ్ లో నిర్వహిస్తున్న యాత్రపై బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ ఎంత చెప్పినా వినకుండా ఇరు పార్టీల సభ్యులు పెద్దగా నినాదాలు చేశారు. దాంతో, సభను స్పీకర్ మీరాకుమార్ ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభ కూడా 15 నిమిషాల పాటు వాయిదాపడింది.