: కురియన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. 111మందిపై కేసు


సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పై ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు 111 మందిపై కేసు నమోదైంది. కేరళ మహిళా కాంగ్రెస్ నేత బిందు క్రిష్ణ ఈ రోజు తిరువనంతపురంలో సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు కురియన్ కు పరువునష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. 

నాటి అత్యాచార కాండలో కురియన్ కూడా నిందితుడేనంటూ రెండు రోజుల క్రితమే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో ధర్మరాజన్, ఉన్ని క్రిష్ణన్, జమాల్ ను కూడా నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. "1996 ఫిబ్రవరి 19న కురియన్ తాను కలిసి కుమిలీ అతిథి గృహానికి వెళ్లామని అక్కడే బాధితురాలు అత్యాచారానికి గురైంది" అంటూ ధర్మరాజన్ టీవీ చానల్ లో చెప్పిన విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News