: నేడు పార్లమెంటులో 'ఆహార భద్రత బిల్లు'


పార్లమెంటులో నేడు 'ఆహార భద్రత' బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పేదవారికి ఆహారాన్ని అందించే ఈ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. యుపిఎ హయాంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపుల్లో కుంభకోణం, బొగ్గుశాఖ ఫైళ్లు గల్లంతవడం అంశాలపై ఇప్పటికే పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గల్లంతైన ఫైళ్లపై ప్రధానమంత్రి ద్వారా ప్రకటన ఇప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షానికి హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఫైళ్ల వ్యవహారంపై ప్రకటన చేయనున్నారు. అటు ఎంపీలందరూ ఈ వారం రోజులపాటు సభకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది ఆహార బిల్లును ఆమోదింప జేసుకోవడానికి వర్షాకాల సమావేశాలను సెప్టెంబరు అయిదు వరకూ పొడిగించారు.

  • Loading...

More Telugu News