: చంచల్ గూడ జైలు వద్ద భద్రత కట్టుదిట్టం
జగన్ నిరాహార దీక్ష నేపథ్యంలో చంచల్ గూడ జైలు, పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీక్షకు మద్దతుగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనలకు దిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి చూస్తే జగన్ దీక్షను ఈ రోజు జైలు అధికారులు భగ్నం చేసే పరిస్థితి కనిపిస్తోంది.