: తిరుమల శ్రీవారి స్వర్ణ రథానికి కొత్త కాంతులు


ఏడుకొండల వాడి స్వర్ణ రథం కొత్త కాంతులను సంతరించుకోనుంది. పసిడి మరింతగా మెరిసిపోనుంది. శ్రీవారి స్వర్ణ రథం తాపడం పనులను ఈవో గోపాల్ ఈ ఉదయం ప్రారంభించారు. ఇందు కోసం 73 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. 32 అడుగుల ఎత్తున్న స్వర్ణ రథం కోసం 23.80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తాపడం పనులు సెప్టెంబర్ 25లోగా పూర్తవుతాయని చెప్పారు. దీంతో బ్రహ్మోత్సవాలకు స్వర్ణ రథం సర్వం సిద్దం కానుంది.

  • Loading...

More Telugu News