: విశాఖలో హెచ్ పీసీఎల్ కార్మికుల ఆందోళన
విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్ పీసీఎల్) కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. కంపెనీ రిఫైనరీ కూలింగ్ టవర్ లో భారీ పేలుడు, అగ్నిప్రమాదం జరిగి 8 మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో కార్మికులు కాలిన గాయాలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఈరోజు బంద్ పాటిస్తున్నారు. భద్రతా ప్రమాణాలను పటిష్టపరచాలని కోరుతూ కార్మికులు రిఫైనరీ ప్రధాన ద్వారం ముందు ఆందోళన చేపట్టారు. శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగితే మృతుల సంఖ్యను ఇంతవరకూ స్పష్టంగా ప్రకటించలేదని, గల్లంతైన వారి వివరాలు కూడా వెల్లడించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.