: ఇలాంటివి మగవారికి నచ్చవట!


కొన్ని విషయాలను తమ భార్యల నోటివెంట వినడానికి భర్తలు ఇష్టపడరట. సాధారణంగా భార్యలు చెప్పే విషయాల్లో కొన్నింటిని వినడానికి భర్తలు సుముఖత చూపరు. అయితే ఏ విషయాలు తమ భర్తలకు నచ్చుతాయి? అనే విషయాలను భార్యలు సరిగ్గా గుర్తించలేరు. వాటిలో కొన్నింటిని గురించి... మీరు ఈరోజు కాస్త ఎక్కువ తాగారు, అలాగే వాటితోబాటు స్నాక్స్‌ ఎక్కువగా తీసుకున్నారు. ఇలాంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం ఏమవుతుందో మీకు తెలుసా? అంటూ భార్య అనడం భర్తకు ఇష్టం ఉండదట.

'మీరు మీ గర్ల్‌ఫ్రెండ్‌తో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఆ విషయాన్ని గుర్తించాను' అనడం, 'నేను ఈ డ్రస్‌లో లావుగా ఉన్నానా?' అని మీరు అడగడం, ఈ విషయంలో మీ భర్తలు ఎంత నిజం చెప్పినా మీరు మాత్రం తనని నమ్మరని వారు భావిస్తారు. అందుకే మీరు అలా అడగడాన్ని వారు ఇష్టపడరట. 'నేను మీ గర్ల్‌ ఫ్రెండ్‌కన్నా కూడా అందంగా ఉండనని నాకు తెలుసు, కానీ మా ఇద్దరిలో తెలివితేటల విషయంలో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తావు?' అని ప్రశ్నించడం, ఫలానా దగ్గరికి వెళతామని మనం అనుకున్నాం గుర్తుందా? అంటూ ప్రశ్నించడం ఇలా పలు విషయాలు గురించి భార్యలు తమ భర్తలను ప్రశ్నించడాన్ని భర్తలు ఇష్టపడరట. కాబట్టి మీరు మీ భర్తల విషయంలో ఇలాంటి ప్రశ్నలను సంధించకుండా జాగ్రత్తపడండి.

  • Loading...

More Telugu News