: ఐబీఎల్ కు అంచనాలకు మించిన ఆదరణ లభిస్తోంది: సైనా
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ కు అంచనాలకు మించి ఆదరణ లభిస్తోందని హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ హర్షం వ్యక్తం చేస్తోంది. తొలి సీజన్ లో కొన్ని సమస్యలు ఎదురైనా ముంబై, పూణె వంటి నగరాల్లో అభిమానుల్ని స్టేడియాలకు రప్పించడంలో ఐబీఎల్ సఫలమైనట్టు సైనా తెలిపింది. హైదరాబాద్ లీగ్ లో మ్యాచ్ లు ఆడేందుకు పుల్లెల గోపీచంద్ అకాడమీకి చేరుకున్న సైనా నెహ్వాల్ జట్టుతో కలిసి మీడియాతో మాట్లాడింది. చైనా క్రీడాకారులు లేనంత మాత్రాన ఐబీఎల్ కళ తప్పలేదని, భవిష్యత్తులో వారిపై ఆధిక్యం సాధించేందుకు కృషి చేస్తామని సైనా చెప్పింది.