: సౌదీలో కొత్త వ్యాధితో వ్యక్తి మృతి
సార్స్ కు సంబంధించిన కొత్త వైరస్ కారణంగా తమ దేశంలో మరో వ్యక్తి మృతి చెందినట్టు రియాద్ లోని సౌదీ ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. మృతి చెందిన వ్యక్తికి 51 సంవత్సరాల వయస్సు ఉంటుందని, అతను గత కొంత కాలంగా క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మృతి చెందినట్టు తెలిపారు.