: భారత్, బంగ్లాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు


భారత్, బంగ్లాదేశ్ లమధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు దేశాలకు సంబంధించిన అన్ని అంశాలు పరిష్కారమయ్యాయని ఇరుదేశాల అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భారత్, బంగ్లాదేశ్ 82 వ జాయింట్ బోర్డర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు మాట్లాడారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులే కాదు, పశ్చిమబెంగాల్ లోని స్వతంత్ర ప్రాంతాలు, త్రిపుర లోని చందన్ నగర్, దక్షిణ త్రిపురలోని ముహ్రి నదీ వివాదం తదితర అంశాలు పూర్తిగా పరిష్కారమయ్యాయని బంగ్లాదేశ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ మనమ్, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ ఆర్ బిశ్వాల్ లు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News