: గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం అంటే ఇదేనా?: అశోక్ బాబు
తమ ఉద్యమంలో ఐక్యత ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తమ పోరాటం తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా కాదని గుర్తించాలని కోరారు. తాము చేసే ఉద్యమం సమైక్య ఉద్యమమని, అందులో ఐక్యత ఉందని స్పష్టం చేశారు. ఇక్కడి వారు ప్రచారం చేస్తున్నట్టు అక్కడ దాడులు జరగడం లేదని తెలిపారు. న్యాయవాదుల తీరు బాధాకరమన్న అశోక్ బాబు, ఎపీఎన్జీవో భవన్ లో జరిగిన ఘటనను ఖండించారు. తెలంగాణ వాదులు విభజన కోరుకుంటే వ్యవహార శైలి ఇది కాదని సూచించారు. తెలంగాణ వారి తీరు ఇలాగే ఉంటే ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం అంటే ఇదేనా? అని తెలంగాణ వాదులను సూటిగా ప్రశ్నించారు.