: వీహెచ్ పీ నేతల అరెస్టులను ఖండించిన బీజేపీ
విశ్వహిందూ పరిషత్ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాల అరెస్టును బీజేపీ ఖండించింది. రాజకీయంగా లబ్దిపొందేందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపించారు. అయోధ్య రామమందిరం ఎన్నికలకు సంబంధించిన అంశం కాదని, ఒక సంస్కృతికి సంబంధించినదని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కోసి పరాక్రమ యాత్రను నిషేధించడం సరైన చర్యకాదన్న ఆయన పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య యాత్రకు అనుమతినిచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.