: సోనియా గాంధీకి వాడవాడలా కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ పొంగులేటి


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీకి వాడవాడలా కృతజ్ఞతలు చెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న వూసరవెల్లి తీరుతోనే సీమాంధ్రలో ఉద్యమాలు నడుస్తున్నాయని ఆరోపించారు. అన్ని అంశాలపై అనుమానాలు, ఆందోళనలపై ఆంటోనీ కమిటీలకి చెప్పుకోవచ్చిని సూచించారు. కరీంనగర్ లో తెలంగాణ నిర్మాణం కోసం ప్రకటన చేసినప్పుడు వైఎస్ కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలని వైఎస్సార్ సీపీకి హితవు పలికారు. కింగ్ మేకర్ నని చెప్పుకునే బాబు అభద్రతా భావంతో ఆందోళనలు చేస్తున్న ప్రజలకు ఎందుకు స్పష్టతనివ్వడం లేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News