: రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురి మృతి


రెండు ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట వద్ద ములుపులో జరిగిన ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొట్టాయి. మలుపు ఉండడం, మితి మీరిన వేగంతో వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతులు ఘటనా స్థలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టవలసకు చెందిన అడప వేణు(40) రంగారావు(45), 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న సూరంపేటకు చెందిన నాయుడు(38) గా గుర్తించారు.

  • Loading...

More Telugu News