: ముగిసిన హైదరాబాద్ మారథాన్
హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియం వరకు జరిగిన మారథాన్ ముగిసింది. ఈ పరుగులో పురుషుల విభాగంలో రాంసింగ్ యాదవ్ ప్రధమస్థానం సాధించగా, మహిళా విభాగంలో జ్యోతిసింగ్ ప్రధమస్థానం సాధించింది. విజేతలకు మాజీ డీజీపీ దొర బహుమతులు అందజేశారు.