: తెలంగాణ, సీమాంధ్ర న్యాయవాదుల తోపులాట, ఉద్రిక్తత
రాష్ట్రంలో వాదాలు వివాదాలు రేపుతున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన వారి స్వేచ్ఛను మరో ప్రాంతానికి చెందిన వారు హరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అబిడ్స్ లోని ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యాలయంలో సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాదులు ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ న్యాయవాదులను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు.