: ఐపాడ్ తో అక్షరాభ్యాసం


పలకాబలపం పట్టుకుని బడికెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడిక డిజిటల్ స్కూల్స్ దే అగ్రస్థానం. భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో ఐపాడ్ లే కీలక పాత్ర పోషించనున్నాయి. స్టీవ్ జాబ్స్ స్కూల్స్ పేరుతో నెదర్లాండ్స్ లో ప్రారంభమైన ఏడు బడుల్లో పిల్లలకు విద్యాభ్యాసం ఐపాడ్ ల ద్వారా సాగుతోంది. 'ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఎరా' నినాదంతో '04ఎస్ టీ ఫౌండేషన్' ఆధ్వర్యంలోని విద్యావిధానంలో ఐపాడ్ కీలకపాత్ర పోషించనుంది. ఈ ఏడు స్కూళ్లలో మొత్తం వెయ్యి మంది బాలబాలికలు విద్యనభ్యసిస్తున్నారని, వచ్చే ఏడాది మరిన్ని ఎక్కువ పాఠశాలలు ప్రారంభిస్తామని ఆ ఫౌండేషన్ తెలిపింది. ప్రపంచం త్వరితంగా డిజిటలైజ్ అవుతున్న నేపథ్యంలో పాఠశాల వాతావరణాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఈ విద్యావిధాన రూపకర్త మౌరిస్ డి హౌండ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News