: చంచల్ గూడ జైలులో కొనసాగుతున్న జగన్ దీక్ష
చంచల్ గూడ జైలులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర విభజన ప్రకటన రాజకీయ స్వార్థంతో చేసిందని, ఈ ప్రక్రియ వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని జగన్ దీక్షకు దిగినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ చంచల్ గూడ జైలులో దీక్షకు దిగడంతో జైలు చుట్టూ మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎవర్నీ లోపలికి అనుమతించడం లేదు.