: కొత్త రాజకీయ పార్టీకి సిద్ధం: ఓయూ జేఏసీ
నవంబరులోగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి రాష్ట్రపతి నుంచి అనుమతి ఉత్తర్వులు తీసుకురాకుంటే విద్యార్థి జేఏసీ రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధంగా ఉందని ఓయూ జేఏసీ తెలిపింది. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆద్వర్యంలో జరిగిన మీట్ ద ప్రెస్ లో ఓయూ జేఏసీ నేతలు మాట్లాడుతూ త్వరలో ఏర్పడనున్న కొత్త రాష్ట్రం నిర్మాణంలో కూడా విద్యార్థులు ముఖ్యపాత్ర పోషిస్తారని అన్నారు. వచ్చే నెల 7 న జరుగనున్న ఏపీఎన్జీవోల సభకు ప్రభుత్వం అనుమతి ఇస్తే సమంజసంగా ఉండదని జేఏసీ నేతలు హెచ్చరించారు.