: కాంగ్రెస్ మంత్రులు సమైక్యాంధ్ర కోసం పోరాడాలి: సీఎం రమేష్
కాంగ్రెస్ మంత్రులు సమైక్యాంధ్ర కోసం పోరాడాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ విలీనం, సీమాంధ్రలో వైఎస్సార్ సీపీతో పొత్తు, ఇదే కాంగ్రెస్ పార్టీ కుటిల నీతని మండిపడ్డారు. మరో ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ సస్పెన్షన్ ఉత్తర్వులు తొలగించాలని అడిగినా స్పీకర్ స్పందించలేదని తెలిపారు. అందుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర రేపటి నుంచి నిరవధిక దీక్ష చేయనున్నామని స్పష్టం చేశారు.