: ప్రధాని ఎవరనేది ఆ ఆరు పార్టీలే నిర్ణయిస్తాయి: పవార్


వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో ఆరు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ పార్టీల ఆమోదం ఉన్న నేతే ప్రధాని కాగలరని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, బీజూ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, ఏఐడీఎంకే పార్టీలే 2014లో కింగ్ మేకర్లని పవార్ పేర్కొన్నారు. వీటి సహకారం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (272)ను చేరుకోవడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అసాధ్యమన్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, బీజేపీ తరఫున నరేంద్ర మోడీ పేర్లు ప్రధాని అభ్యర్థిత్వానికి వినిపిస్తూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంది.

  • Loading...

More Telugu News