: 'అత్యాచారంతో జీవితం ముగిసిపోదు'... ఆత్మ స్థైర్యం సడలని ఫోటో జర్నలిస్ట్
అత్యాచారంతో జీవితం ముగిసిపోదు...
ఈ మాటలన్నది ఎవరో రాజకీయనాయకులు కాదు. అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి నోటి నుంచి ఆత్మస్థైర్యంతో వచ్చిన మాటలివి. మొన్న అత్యాచారానికి గురై ముంబై జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో జర్నలిస్ట్ యువతను ఉత్తేజపరుస్తూ ఆసుపత్రి బెడ్ మీది నుంచి ఇచ్చిన సందేశమిది. వీలైనంత త్వరగా కోలుకొని మళ్లీ విధుల్లో చేరాలనుకొంటున్నానని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నదే తన అభిప్రాయమని తెలిపింది. తనపై జరిగిన అత్యాచార ఘటన మనసును కలచివేస్తున్నా, ఆమెలో ఆకాశమంత ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మల సామంత్ ప్రభావల్కర్ తెలిపారు. ఆ యువతిని పరామర్శించినపుడు ఆమె కనపరిచిన సంకల్పబలం తననెంతో ఉప్పొంగిపోయేలా చేసిందన్నారు.