: అనంతపురంలో విద్యుత్ ఉద్యోగుల వినూత్న నిరసన


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. గత 24 రోజులుగా వివిధ రీతుల్లో నిరసనల ద్వారా తమ ఆందోళన ప్రభుత్వానికి తెలుపుతున్న ఉద్యోగులు ఈ రోజు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. రాయదుర్గంలో విద్యుత్ ఉద్యోగులు స్థానిక వినాయక్ సర్కిల్ లో మోకాళ్లపై నిల్చుని విభజనపై వ్యతిరేకతను చాటారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అన్ని శాఖల ఉద్యోగులు నిరసనలు చేశారు.

  • Loading...

More Telugu News