: హెచ్ పీసీఎల్ దుర్ఘటనపై న్యాయవిచారణ జరపాలి: సీపీఎం
విశాఖపట్టణంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ పీసీఎల్)లో జరిగిన ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ ప్రమాదానికి యాజమాన్యమే కారణమని ఆరోపించారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టు, 40 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపిన ఆయన, యాజమాన్యం ఆ రోజు పనిలోకి వచ్చిన ఉద్యోగుల వివరాలు బహిర్గతం చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.