: దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా పార్క్ గ్వెన్ హే
దక్షిణ కొరియాకు తొలిసారి ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఓ సైనికాధికారి కుమార్తె అయిన పార్క్ గ్వెన్ హే.. అధ్యక్షురాలిగా నేడు ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఎంతమాత్రం సహించబోమన్నారు. అణు పరీక్షలు తక్షణమే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, ఆసియా నాలుగో అతి పెద్ద ఆర్థిక శక్తి అయిన దక్షిణ కొరియాకు అధ్యక్షురాలిగా ఎన్నికైన పార్క్ ముందర పలు సవాళ్లున్నాయి. అభివృద్ధి రేటు మందగించడం, సంక్షేమ వ్యయాలు పెనుభారంగా మారుతుండడం వంటి పలు సమస్యలపై ఆమె దృష్టి సారించాల్సి ఉంది.