: అత్యాచార బాధితురాలికి మహిళా వైద్య బృంద సేవలు
ముంబైలో సామూహిక అత్యాచారానికి గురైన యువతికి జస్లోక్ ఆసుపత్రిలో పూర్తిగా మహిళా వైద్యులతో కూడిన బృందం సేవలు అందిస్తోంది. భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉండాలని నిపుణుల సలహా మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె కోలుకుంటోందని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతోందని స్పష్టం చేశారు. దాదాపు 30 మంది పోలీసులు ఆసుపత్రి ఆవరణలో భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.