: ముందస్తు ఎన్నికలు ఉంటాయనే సోనియా చెప్పారు: వెంకయ్య


భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తం చేయాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయడు ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలు మానుకోవాలని హితవు పలికారు. సోనియా నర్మగర్భంగా ముందస్తు ఎన్నికలు ఉంటాయని చెప్పారని అన్నారు. అనిశ్చిత పరిస్థితుల నివారణకు ప్రజస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే పరిష్కారమని సూచించారు.

తెలంగాణ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ను బీజేపీ వ్యతిరేకించడంతో ఆ పార్టీ వైఖరిపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకయ్య అలాంటిదేమీ లేదని ప్రకటించారు. పార్లమెంటులో తన వ్యాఖ్యలను అర్థం చేసుకోలేక అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. పొత్తులు గురించి చర్చించలేదని, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని కాంగ్రేసేతర పక్షాలన్నింటికీ చెబుతున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News