: ఎందుకీ కోసీ పరిక్రమ యాత్ర?


విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) చౌరాసి కోసి పరిక్రమ యాత్రను అయోధ్య నుంచి పరిసర గ్రామాల మీదుగా 84 కిలోమీటర్ల మేర నిర్వహించనుంది. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలనే డిమాండ్ తో ఈ యాత్రను తలపెట్టింది. ఇందుకోసం వీహెచ్ పీ నేతలు ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకున్నారు. సుమారు 50 వేల మంది వరకు కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని అంచనా.

ఉత్తరప్రదేశ్ సర్కారు అనుమతి నిరాకరించడంతో యాత్రకు అవరోధం కలగకూడదనే ఉద్దేశంతో వీహెచ్ పీ నేతలు ముందుగానే యాత్ర మార్గంలో అన్ని గ్రామాల ప్రజలతో సమావేశమై తమకు సహకారం అందించాలని కోరారు. సాధువులకు ఆహ్వానం పలికి యాత్రలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల మద్దతు ఉంటే ప్రభుత్వం పోలీసు చర్యకు వెనకాడుతుందనేది వారి వ్యూహం. వీహెచ్ పీ నేతలు దీనిని శాంతియాత్రగానే పేర్కొంటున్నారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం మాత్రం యాత్రను విచ్ఛిన్నం చేసి తీరాలనే పట్టుదలగా ఉంది.

  • Loading...

More Telugu News