: జర్నలిస్టుపై అత్యాచారం పట్ల జయసుధ, నందితా దాస్ ఆందోళన
ముంబైలో ఫోటో జర్నలిస్టుపై అత్యాచారం జరగడంపై ప్రముఖ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినప్పటికీ మహిళలపై ఈ రకమైన దాడులు పెరిగిపోవడం బాధాకరమన్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించి, సమాజానికి సందేశమిస్తే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం తగ్గుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటి, సంఘసేవిక నందితాదాస్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశ్యముంటే తక్షణం ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించి సమాజానికి సందేశమివ్వాలని అభిలషించారు.