: సీమాంధ్ర ఎంపీలకు సస్పెన్షన్ ఆదేశాలు జారీ
లోక్ సభలో సస్పెండైన సీమాంధ్ర ఎంపీలకు స్పీకర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29 వ తేదీ వరకు సీమాంధ్రకు చెందిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెండైన సభ్యులు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కారాదని స్పీకర్ కార్యాలయం సూచించింది.