: తెలంగాణ మంత్రుల భవిష్యత్ కార్యాచరణ
సీమాంధ్రుల ఆందోళనల ఒత్తిడికి తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తుందని సాక్షాత్తూ సోనియాగాంధీ ప్రకటించడంతో తెలంగాణ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఈ నెల 28 న మరోసారి సమావేశం కానున్నారు. గత వారం భవిష్యత్ కార్యాచరణపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా చర్చించిన తెలంగాణ మంత్రులు 28న ప్రణాళిక ప్రకటించనున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అయితే ఈ సమావేశాలు ఎలా ఉండాలి? సమావేశాల్లో ఏమేం చేయాలి? అన్న అంశంపై ఈ నెల 28 న నిర్ణయం తీసుకుంటారు.