: మోడీ పుట్టినరోజుకు గుజరాత్ బీజేపీ సరికొత్త ప్రణాళిక
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును సరికొత్తగా జరిపేందుకు ఆ రాష్ట్ర బీజేపీ శాఖ ముందునుంచే ప్రణాళికలు వేస్తోంది. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు. ఎప్పుడూ తన పుట్టినరోజును ఆయన చాలా సాధారణంగా జరుపుకుంటారు. ఈసారి మాత్రం తొమ్మిది రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని గుజరాత్ బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి ఐకే జడేజా తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ తొమ్మిది రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులు మొక్కలు నాటడం, మెడికల్ క్యాంప్ లు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. గుజరాత్ అభివృద్ధితో దేశ వ్యాప్తంగా పాప్యులర్ అయిన మోడీ, 2014 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి కొత్త ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది.