: రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయండి: కిశోర్ చంద్రదేవ్
ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేయాలంటూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆంటోనీ కమిటీకి లేఖ రాశారు. ఈ మేరకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణగా రాష్ట్రాన్ని విభజించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి విశాఖను రాజధానిగా చేయాలని ఆరుపేజీల లేఖలో కోరారు. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితికి ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ కారకులని లేఖలో విమర్శించారు.