: రెండో ఎస్సార్సీ ద్వారానే కొత్త రాష్ట్రాలు ఏర్పడాలంటూ వ్యాజ్యం
రెండో ఎస్సార్సీ ద్వారానే కొత్త రాష్ట్రాలు ఏర్పడాలంటూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విభజన అంశంపై శాసనసభలో విధిగా ఆమోదం పొందేలా చూడాలని పిల్ లో పేర్కొన్నారు.